SIR షెడ్యూల్లో మార్పులు
* SIR షెడ్యూల్లో మార్పులు
* డిసెంబర్ 22న ఏపీ తుది ఓటర్ల జాబితా
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) మార్పులు చేసింది. ఓటర్ల జాబితాలో పేర్లు చేరని వారికి, ముఖ్యంగా ఏఎస్డీడీ (ASDD Voters) కేటగిరీలో గుర్తించిన ఓటర్లకు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. ASDD కేటగిరీలో గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్లను గుర్తించారు.
ఈ కేటగిరీ ఓటర్ల కోసం నవంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ, సేకరణ చేపట్టనున్నారు. గతంలో ఫామ్లు సమర్పించకపోవడం వల్ల ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫామ్లను సంబంధిత బూత్ స్థాయి అధికారులు (Booth Level Officers – BLOs) ద్వారా పొందవచ్చు.
* డిసెంబర్ 10 వరకు పరిశీలన..
సేకరించిన ASDD ఫామ్ల పరిశీలన, పరిష్కార ప్రక్రియను డిసెంబర్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం (Election Commission) గడువు విధించింది. ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి డిసెంబర్ 15 వరకు సమయం ఇచ్చింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 22న ఏపీ తుది ఓటర్ల జాబితా (AP Final Voter List) ప్రచురించనున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన ఫామ్లను గడువులోగా సమర్పించాలని సూచించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

