పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
* బాధితులకు పరిహారం అందించాలని పవన్ ఆదేశం
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రకాశం జిల్లాలో (Prakasam District) జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకారుల (Fishermen) కుటుంబాల్లో ఆందోళన కలిగించింది. కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మత్స్యకారులు భద్రపరిచిన వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 250 నుంచి 300 వలలు కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా తమ వలలను షెడ్లలో భద్రపరిచారు. ఈ క్రమంలో కె. పల్లెపాలెంలోని షెడ్లలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉంచిన వలలు పెద్ద సంఖ్యలో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
* కలెక్టర్‌తో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి..
అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, బాధిత మత్స్యకారుల వివరాలపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు.
తుపాను (Cyclone) కారణంగా ఇప్పటికే వేట విరామం కొనసాగుతుండగా, ఇప్పుడు వలలు కూడా కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నష్టపోయిన మత్స్యకారులకు తగిన పరిహారం (Compensation) అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
* మత్స్య సంపద పథకం కింద కొత్త వలలు..
అగ్నిప్రమాదంలో దగ్ధమైన వలల స్థానంలో బాధితులకు కొత్త వలలు అందించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 (PM Matsya Sampada Yojana 2.0) పథకం కింద అవసరమైన ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. నష్టపోయిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా తక్షణ సహాయం, పరిహారం, వలల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read : కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్

Please tell us what is wrong. Your report will be sent to the website team.

