యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి (ఫైల్ ఫోటో)
* 91 ఏళ్ల వయసులో తల్లి సావిత్రీ దేవి కన్నుమూత
* స్వగ్రామం పంచూర్లో తుదిశ్వాస
* హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం (Yogi Adityanath Mother) కలిగింది. ఆయన తల్లి సావిత్రీ దేవి (91) కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్‌లోని తన స్వగ్రామ నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
* కొంతకాలంగా అనారోగ్యంతో..
సావిత్రీ దేవి (Savitri Devi) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. యోగి ఆదిత్యనాథ్ తల్లి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
* రాజకీయ ప్రముఖుల సంతాపం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి పంకజ్ చౌధరి తదితరులు సావిత్రీ దేవి (Savitri Devi) మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
* హరిద్వార్‌లో అంత్యక్రియలు
సావిత్రీ దేవి (Yogi Adityanath Mother) అంత్యక్రియలను శనివారం హరిద్వార్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆమె మృతి పట్ల పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన నటి!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

