ఆకేరు న్యూస్, డెస్క్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు అజ్మీరా రేఖా నాయక్‌కు (Ajmeera Rekha Naik) చెందిన నివాసాలు, ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం అక్రమాల కేసులో మనీలాండరింగ్ (Money Laundering) కోణంలో ఈ తనిఖీలు చేపట్టారు. రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్‌కు (Ajmeera Rekha Naik ED Raids) చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రభుత్వానికి కేటాయించిన ధాన్యం భారీగా తగ్గినట్లు గతంలో పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. మూడు రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కల్లో లేదని తనిఖీల్లో తేల్చారు. దీని విలువ సుమారు రూ.40.96 కోట్లుగా అంచనా వేశారు.
* గతంలోనే కేసు నమోదు..
2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (Custom Milling Rice) కోసం ప్రభుత్వం సత్తెనపల్లిలోని ఈ రైస్ మిల్లుకు ధాన్యం కేటాయించింది. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ధాన్యం, బియ్యం నిల్వల్లో భారీగా కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఖానాపూర్ పోలీసులు రేఖా నాయక్‌పై (Ajmeera Rekha Naik ED Raids) భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 316(2), 316(5), 318(4)తో పాటు నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు చేశారు.
* మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు..
ధాన్యం అక్రమాల వ్యవహారంలో నిధుల లావాదేవీలు, అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్న ఆస్తుల వివరాలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి.
Read Also : బంగారం ధరలు ఢమాల్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

