బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తానంటూ సీఎం చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం కేబినెట్లోనే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయలేని రేవంత్ రెడ్డి, వచ్చే ఎన్నికల తర్వాత పదవులు ఇస్తానంటూ హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మొదట సిరిసిల్లకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారని, తాజాగా సిద్దిపేట సభలోనూ ఇదే తరహా హామీ ఇచ్చారని ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితిలో ఇప్పుడే మంత్రి పదవుల హామీలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
* ముందు ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయాలి
రేవంత్ రెడ్డి కేబినెట్లో (Telangana Cabinet) ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, ముందుగా వాటిని భర్తీ చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పదవులను ఎవరికి కేటాయించాలనే విషయంలో ఎమ్మెల్యేలు పార్టీని వీడతారనే భయంతోనే సీఎం నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు. తన కేబినెట్లోని ఖాళీలను భర్తీ చేయలేని ముఖ్యమంత్రి, భవిష్యత్తులో మంత్రి పదవులు ఇస్తానంటూ హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
* రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
ఇటీవల కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో స్పందించారు. పార్టీ నేతల్లో కొందరికి పిచ్చి కుక్క కరిచినట్లుందని, మైక్ ముందు పిచ్చి లేచినట్లు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిని ఉద్దేశించి చేసినవిగా వార్తా కథనాలు పేర్కొన్నాయి.
Also Read : రేవంత్ రెడ్డి కామెంట్స్.. పిచ్చి కుక్క కరిచిందా..!
ఇదే సమయంలో సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తానంటూ సీఎం చేసిన ప్రకటనలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తాజాగా వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలతో తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మంత్రి పదవుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

