Errabelli Dayakar Rao Wedding Events
* పలువురి వివాహ వేడుకల్లో సందడి చేసిన దయాకర్ రావు
ఆకేరు న్యూస్, పాలకుర్తి : పాలకుర్తి మండల పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మండలంలోని శాతాపురం క్రాస్ తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు లకావత్ మిట్యా నాయక్ కుమారుడి వివాహ విందు వేడుకతో పాటు, గన్న అజయ్ కుమార్ గారి వివాహ విందు కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పాల్గొన్నారు.
అనంతరం బీక్యా నాయక్ పెద్ద తండాకు చెందిన గుగులోత్ వెంకన్న కుమారుడి వివాహ విందు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆప్యాయంగా పలకరించి అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన వధూవరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించి సందడి చేశారు.
ఈ కార్యక్రమాల్లో మండల నాయకులు, గ్రామ శాఖ నాయకులు, యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : బిస్లరీ వాటర్ వివాదం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

