* ‘గో రక్షణ’ మూక దూకుడు చర్య
* దోపిడీ దొంగలనుకుని కారుని వేగంగా నడిపిన యువకులు
* వెంబడించి మరీ కాల్పులు జరిపిన ‘గో రక్షణ’ మూక
* విద్యార్థులని తెలిసి పరారీ
* ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్ డెస్క్ : గోవుల స్మగ్లర్లు అనుకుని ‘గో రక్షణ’ మూక విద్యార్థులపై కాల్పులు జరిపింది. కాల్పల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారి(Delhi-Agra National Highway)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్యన్ మిశ్రా(19), హర్షిత్, శాంకీ అనే యువకులు తమ స్నేహితులైన మరో ఇద్దరు యువతులతో కలిసి ఎస్యూవీ కారు(Suv Car)లో ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారి వైపు వెళ్తున్నారు. హర్షిత్ కారు నడుపుతుండగా, ఆర్యన్ మిశ్రా అతడి పక్క సీట్లో కూర్చోని ఉన్నాడు. అయితే.., ఆవుల స్మగ్లర్లు (Cow Smuglors)రెండు ఎస్యూవీ కారుల్లో ఫరీదాబాద్(Faridabad)లో రెక్కీ నిర్వహిస్తున్నారని ఆగస్టు 23వ తేదీ రాత్రి ‘గో రక్షణ’ మూకకు సమాచారం అందింది. అదే సమయంలో ఎస్యూవీ కార్లలో వెళ్తున్న మిశ్రా బృందాన్ని స్మగ్లర్లుగా భావించారు. వారి కారులో వారిని ఢిల్లీ – ఆగ్రా జాతీయ రహదారిలో సుమారు 30 కిలోమీటర్లు వాళ్లని వెంబడించారు. తుపాకీలు చూపుతూ కారును ఆపమంటుండడంతో మిశ్రా బృందం వారిని దోపిడీ దొంగలుగా భావించింది. దీంతో కారును మరింత వేగంగా నడపడం ప్రారంభించారు. అది చూసిన గో రక్షణ సభ్యులు మరింత వేగంగా వారిని వెంబడించారు. ఈ క్రమంలో గదపురి టోల్ ప్లాజా వద్ద పెట్టిన బ్యారికేడ్లను ఆ యువకులు ఢీకొట్టి వెళ్లారు. దీంతో ‘గో రక్షణ’ సభ్యులు అక్కడ వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆర్యన్ మిశ్రాకు బుల్లెట్ గాయం కావడంతో హర్షిత్ వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత మరోసారి గో రక్షణ సభ్యులు ఆర్యన్ పై కాల్పులు జరిపారు. ఆర్యన్ మిశ్రా (Aryan Misra)అక్కడికక్కడే మరణించాడు. అనంతరం కారులో మరో ఇద్దరు యువతులను చూసిన ‘గో రక్షణ ’ మూక తాము దాడి చేసింది స్మగ్లర్లపై కాదని గ్రహించి పరారయ్యారు. పోలీసులు ఆ మూకకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
