ఎగసిపడుతున్న అగ్నికీలలు
ఆకేరు న్యూస్ డెస్క్: ముంబైలోని టైమ్స్ టవర్(TIMES TOWER)లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు మంటలు వ్యాపిస్తున్నాయి. అగ్నీకీలలు ఎగసిపడుతున్నాయి. ఉదయం ఆరున్నర గంటల సమయంలో లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు(FIRE) చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొమ్మిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కమల మిల్ కాంపౌండ్(KAMALA MIL COMPOUND)లో ఉన్న ఈ ఏడు అంతస్తుల వాణిజ్య సముదాయంలో మంటలు అంటుకున్నట్లు తమకు ఉదయం 6.30 గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మంటలను అదుపుచేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని బృహిన్ ముంబై కార్పొరేషన్ (BRUHIN MUMBAI CORPORATION) తెలిపింది.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
