* వాతావరణ శాఖ హెచ్చరికతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(HYDERABAD)లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్సో్(BANJARAHILLS), జూబ్లీహిల్స్, మాదాపూర్(MADAPUR), మణికొండ, మెహిదీపట్నం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో దంచికొడుతోంది. నగరమంతా మబ్బులు కమ్మేశాయి. సాయంత్రం 4 సమయానికే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ ఎంసీ అలర్ట్ అయింది. అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించింది. మ్యాన్ హోల్(MANHOLE) మూతలను తెరవద్దని ప్రజలను కోరింంది.
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
