* బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చి రాక్షసానందం పొందడం కాదని, కష్టాల్లో ఉన్న వారి కళ్లను తుడవాలని సీఎం రేవంత్ రెడ్డి(Cm RevanthReddy)పై బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్‌కుమార్(Praveen Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. రోమ్ నగరం తగలబడి పోతుంటే కోటలో కూర్చొని ఫిడేలు వాయించినట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. వనపర్తి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాల(Gurukula digree College), పెద్దమందడి పాఠశాలల భవనాలకు అద్దె చెల్లించక, యజమాని పిల్లలు లోపల ఉండగానే తాళం వేసుకొని పోయాడని, ముఖ్యమంత్రికి ఇలాంటివి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హైడ్రా మత్తులో మునిగితేలుతున్నరని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గారూ.. పేదల ఇళ్లను కూల్చి రాక్షసానందం పొందడం కాదు.. దమ్ముంటే ప్రజల్లో తిరిగి వాళ్ల కన్నీళ్లు తుడవండి.. అని సూచించారు.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
