* వరద నష్టంపై అంచనాకు ఆయా ప్రాంతాల్లో పర్యటన
* సచివాలయంలో సీఎస్తో సమావేశం

ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం(Central Team) నేడు, రేపు తెలంగాణ(Telangana)లో పర్యటించనుంది. ఆరుగురు సభ్యులు గల బృందం సచివాలయంలో సీఎస్ ఎస్ శాంతికుమారి(Cs Shanthikumari)తో సమావేశం కానున్నారు. సీఎస్ నుంచి వివరాలు సేకరించి, వరద నష్టం పై వివిధ జిల్లాల్లో సంభవించిన నష్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించనున్నారు. వరద నష్టాలను పవర్ పాయింట్ ద్వారా సీఎస్ శాంతి కుమారి వివరించనున్నారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆయా ప్రాంతాలను పరిశీలించనున్నారు. కూసుమంచి మండలం, ఖమ్మం రూరల్(Khamam Rural) పరిధిలోని పలు మండలాలు, పాలేరు గండిపడిన ఎన్నెస్పీ కాలువ, ఎర్రగండ తండాలో దెబ్బతిన్న భక్తరామదాసు ప్రాజెక్టు, మహబూబాబాద్ జిల్లా(Mahaboobabadh District)లోని పలు ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టంపై అంచనా వేయనున్నారు.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
