* ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
* చనిపోవడానికి గల కారణాలు వెల్లడి
* కాశీలో ఉంగుటూరు వాసులు మృతి..

ఆకేరు న్యూస్ డెస్క్ : ఓ క్రికెట్ బుకీ టార్చర్ భరించలేక చనిపోతున్నామని ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. మే నుంచి అదృశ్యమైన అన్నదమ్ములు.. కాశీ(Kasi)లోని ఓ ఆశ్రమంలో ఉరేసుకుని చనిపోయారు. అంతకు ముందు సెల్ఫీ వీడియో(SelFie Vedio)లో ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెరుమాళ్ల లక్ష్మీనారాయణ, వినోద్‌లు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online cricket betting)లో భారీగా నష్టపోయారు. దీంతో గత మే నుంచి అదృశ్యమయ్యారు. 4 నెలల నుంచి కాశీలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఈ రోజు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. క్రికెట్ బుకీ దండు గోపాలకృష్ణరాజు వేధింపులు భరించలేక చనిపోతున్నామని సెల్ఫీ వీడియోలో తెలిపారు. వారి మృతిపై ఉంగుటూరు పోలీసులకు కాశీ పోలీసులు సమాచారం ఇచ్చారు.
———————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
