* అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది
* ఎమ్మెల్సీ కోదండరామ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భారాస ప్రభుత్వ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు.. మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని శాసన మండలి సభ్యులు ఆచార్య కోదండరామ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని 1104 యూనియన్ ప్రధాన కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో కోదండరాం ఆత్మీయ సన్మాన మహోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడటమే తన లక్ష్యమని, అందుకే ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. సమస్యలు పరిష్కారం అయిన తర్వాత ఉద్యోగులు పనిచేయరనే భావన అధికారులలో ఉండకూడదన్నారు. అనేక ఆంక్షల తర్వాత ఇలా ప్రశాంతంగా సమస్యల గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమస్యల కోసం విూ వెంటే ఉంటానని.. అందరం కలిసి సమష్టిగా రాష్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేద్దామన్నారు.
…………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
