* వార్డెన్లు, ప్రిన్సిపల్స్లకు తగు సూచనలు
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం, మహాత్మా జ్యోతిరావు పూలే వసతిగృహాన్ని, గిర్నిబావి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఆదివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహాల్లో ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్‌లలోని ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు వార్డెన్లు, ప్రిన్సిపల్స్లకు తగు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. హాజరుతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు. అలాగే టాయిలెట్స్, హాస్టల్ ప్రాంగణం, వంటచేసే ప్రాంతాలను, స్టోర్స్‌లోని సరుకులను పరిశీలించారు. తాజా సరుకులను అందించాలని, హాస్టల్ లోపల, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేస్తూ విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం నర్సంపేట వైద్య ఆసుపత్రి డాక్టర్స్‌తో వైద్య పరీక్షలు చేయంచాలని సంబంధిత హాస్టల్ వార్డెన్లు ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.
…………………………