* వెంటనే సర్పంచ్ల బకాయిలు విడుదల చేయాలి
* ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP ETALA RAJENDER) కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. స్పరంచ్లకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీలకు రావాల్సిన బకాయిల విడుదలలో జాప్యం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు(BC RESERVATIONS) వెంటనే అమలు చేయాలన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
