* మంచి ఆలోచనన్న మంత్రి దామోదర
* కార్యకర్తలకు అద్భుత అవకాశం
* మా ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు
* ప్రజల సమస్యల పరిష్కారం మా బాధ్యత
* అన్ని శాఖల అర్జీలూ తీసుకుంటాం : దామోదర రాజనర్సింహ
* ప్రతి బుధ, శుక్రవారం మంత్రులు హాజరవుతారు : మహేష్‌కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గాంధీభవన్(GANDHIBHAVAN)లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల కోసం ప్రజావాణి(PRAJAVANI) కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మంత్రి దామోదర రాజనర్సింహ(MINISTER DAMODARA RAJANARASIMHA) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రజల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను అమలు చేస్తున్నామన్నారు.
ప్రతీ కార్యకర్తనూ కాంగ్రెస్ గౌరవిస్తుందని, ప్రజావాణి మంచి నిర్ణయమని అన్నారు. ఇక్కడ ఏ శాఖ అర్జీలైనా తీసుకుని పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టిపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్(TPCC CHIEF MAHESHKUMAR GOUD) మాట్లాడుతూ.. బుధవారం, శుక్రవారం గాంధీభవన్‌లో జరిగే ప్రజావాణికి మంత్రులు హాజరవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు అర్జీలు తీసుకుని రావొచ్చని, అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
