* ఆ రెండు పార్టీలకు అలవాటైపోయింది
* మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
* అలాంటి నేతలను రాజకీయాల నుంచి బహిష్కరించాలని పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళలను, కుటుంబాలను విమర్శించడం ఆ రెండు పార్టీలకు అలవాటై పోయిందని, ఈ సంస్కృతిని కేసీఆర్(Kcr), కేటీఆర్(Ktr) మొదలు పెడితే రేవంత్ అండ్ కో (Revanth And Co) కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Central Minister)విమర్శించారు. మహిళలను కించపరిచేలా కొండా సురేఖ(Konda surekha) చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాల గురించి, మహిళల గురించి మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర దురదృష్టకరమన్నారు. తెలంగాణలో ఏ పార్టీ నాయకులైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, లేకుంటే అలాంటి వారిని మీడియా సైతం బహిస్కరించాలని సూచించారు. ఆ రకమైన భాష మాట్లాడడం సరికాదన్నారు.
………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
