* సినీ ప్రముఖులకు టీపీసీసీ విజ్ఞప్తి
* వరంగల్‌లో అక్కినేని అభిమానుల ఆందోళన
* సురేఖ దిష్టిబొమ్మ దహనం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఓ సెలబ్రిటీ జంట విడాకులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ(MINISTER KONDA SUREKHA) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ(TPCC) స్పందించింది. ఇంతటితో ఈ వివాదాన్ని ముగిస్తే సమంజసంగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ (MAHESH KUMAR GOUD)తెలిపారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరిచుకున్నారని వెల్లడించారు. సినీ ప్రముఖులు కూడా ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. ఇరువైపులా మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. సురేఖపై కేటీఆర్(KTR) ట్వీట్లను కూడా పరిశీలించాలని సూచించారు. అలాగే, జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాగా, కొండా వ్యాఖ్యలపై వరంగల్(WARANGAL)లో అక్కినేని అభిమానుల ఆందోళనలు చేపట్టారు. మంత్రి కొండా సరేఖ దిష్టిబొమ్మను దహనం చేశారు.
………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
