* ఆసక్తికరంగా ఎన్నికల ఫలితాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : హర్యానా, జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రస్తుతానికి 90 స్థానాలు గల హర్యానాలో తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ మేజిక్ ఫిగర్ దాటింది. 48 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 35స్థానాల్లో అధిక్యంలో ఉంది. తామే ఇక్కడ అధికారంలోకి వస్తామని, పూర్తి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భూపిందర్ హుడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 49కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ దాటింది. బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతోంది.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
