ఆకేరు న్యూస్ డెస్క్ : డీఎస్సీలో క్వాలిఫై అయి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగానికి అర్హత పొందిన వారికి ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY) ఈరోజు నియామకపత్రాలు అందించనున్నారు. అయితే ఈ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని ఎంఆర్పీఎస్(MRPS) నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ (MANDA KRISHNA)మాదిగ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు వచ్చి రెండు నెలలు దాటినా..ఇప్పటి వరకూ తెలంగాణలో అమలు చేయలేదని దుయ్యబట్టారు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా.. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చేయకుండానే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, ధర్నాలకు పిలుపునిచ్చారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
