* ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం
* ఆలయాన్ని సందర్శించిన కిషన్రెడ్డి
ఆకేరు న్యూస్, సికింద్రాబాద్ : సికింద్రాబాద్(Secunderabad) కుమ్మరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలమ్మ ఆలయం(Mutyalamma Temple)లో విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయాన్ని సందర్శించారు. విగ్రహాన్ని పరిశీలించారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Talasani SrinivasYadav) కూడా ఆలయాన్ని సందర్శించారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
