* మాదాపూర్ లో భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే.. మరో కాలేజీలో విద్యార్థి మృతి ఘటన కలకలం రేపుతోంది. మాదాపూర్‌లోని నారాయణ కాలేజీ భవనం పైనుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు కిటికీలోచి ఔటింగ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక విద్యార్థి చేజారి భవనంపై నుంచి పడి తీవ్రగాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన చేశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
