* బాలికపై అత్యాచారయత్నం
* హనుమకొండలో కలకలం
ఆకేరున్యూస్, హన్మకొండ: హన్మకొండ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలికపై ఓ సీఐ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. ఇతర జిల్లాలో పనిచేస్తున్న సీఐ రవికుమార్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు ఖాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో సీఐ రవికుమార్‌పై కాజీపేట పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు సీఐ రవి కుమార్ హనుమకొండ సరిహద్దు జిల్లాలో పని చేస్తున్నారు. కాగా వడ్డెపల్లిలో నివాసం ఉంటున్నారు.
పోక్సో కేసు నమోదైంది ఖాజీపేట సీఐపై కాదు..
పోక్సో కేసు నమోదు అయింది హనుమకొండ సరిహద్దు జిల్లాలో పనిచేస్తున్న సీఐ రవికుమార్‌పై కాగా, ఖాజీపేటలో పనిచేస్తున్న సీఐ పైనే పోక్సో కేసు నమోదైనట్లు ప్రచార మాధ్యమంలో తప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది. ఖాజీపేట సీఐపైనే పోక్సో కేసు నమోదైనట్లు ఎవరైన ప్రచారమాధ్యమాల్లో న్యూస్ వైరల్ చేస్తే కఠినచర్యలు తప్పవని ఖాజీపేట సీఐ హెచ్చరించారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
