* వీటిని అడ్డుకోవాలని చూస్తున్న బిఆర్ఎస్, బిజెపి
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. కానీ గాంధీ వారసులుగా అంతర్జాతీయ స్థాయిలో బాపూ ఘాట్‌ను అభివృద్ధి చేసి తీరుతాం. కానీ బీజేపీ, బీఆర్ఎస్ వీటిని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) సూటిగా ప్రశ్నించారు. సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడిరచారు. గాంధీ ఐడియాలజీ కేంద్రం గా బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా నగరంలోని బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తాం. దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సర్దార్ పటేల్ విగ్రహం తరహాలో హైదరాబాద్ లోని బాపూ ఘాట్‌లో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అన్నారు.
తెలంగాణలో ఫాంహౌస్ పాలిటిక్స్ చేస్తున్నారని, దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉన్నారా..అని ప్రశ్నించారు. ’బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్యాలెస్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రజల తరఫున గొంతుక అసెంబ్లీలో వినిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై మాజీ సీఎం కేసీఆర్ కు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు.కేసీఆర్ తనని తాను ఓ జవిూందార్ గా భావిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రజలు ఎక్కువ రోజులు సహించరని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి, మాజీ సీఎం కేసీఆర్‌కి తాను ఒకటే మాట చెబుతున్నానని.. నిజంగానే అభివృద్ధి జరగాలని భావిస్తే తనతో మాట్లాడాలన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని రాజకీయాలు చేయాలని, దాంతో అభివృద్దికి ఏ ఆటంకాలు ఉండవన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం వ్యతిరేకిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
…………………………………..