Published:
Updated: 07 Nov 2024 • 11:46 AM
ఆకేరున్యూస్, విశాఖ: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్టార్ ప్లేయర్ పీవీ సింధు ( pv sindhu) భూమి పూజ చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అకాడమీ నిర్మాణానికి తన తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేశారు. పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పీవీ సింధు తెలిపారు. అలాగే ఈ భూమి విషయంలో ఎలాంటి వివాదం లేదని.. ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. ఈ అకాడమీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తామని.. అకాడమీకి సంబంధించిన అన్ని వివరాలూ త్వరలోనే వెల్లడిస్తామని పీవీ సింధు వెల్లడిరచారు.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
