* విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన కోర్టు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం కేసు విచారణను 11వ తేదీకి వాయిదా వేవారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. భారాస తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను మోహన్‌రావు చదివి వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
