* హైదరాబాద్లో ఇబ్బందులు సృష్టించడం కరెక్ట్ కాదు : మంత్రి పొన్నం
ఆకేరు న్యూస్, సిద్దిపేట: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Family Survey)పై అపోహలు అవసరం లేదని, అందరి మంచి కోసమే సర్వే చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ(Telangana)వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. సిద్దిపేట జిల్లా(Siddipet) హుస్నాబాద్ పట్టణంలో కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం పరిశీలించారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అసమానతలు తొలగించేందుకే సర్వే చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్(Hyderabad)లో పలుచోట్ల కొందరు ఇబ్బందులు కలిగించారని, అది సరైనది కాదని వెల్లడించారు. కేవలం కులాల జనాభా తెలుసుకునేందుకే ఈ సర్వే చేస్తున్నామని వివరించారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
