* జూబ్లీహిల్స్ లో ఉలిక్కిపడిన ప్రజలు
* పేలుళ్లకు కారణం ఇదే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad)లో భారీ పేలుడు(Explosion) సంభవించింది. జూబ్లీహిల్స్(Jubilihills) రోడ్డు నెంబరు వన్లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్(Telangana Spicy Kitchen Restaurant)లో ఈ ప్రమాదం జరిగింది. ఉదయాన్నే జరిగిన ఈ ప్రమాదం కలకలం రేపింది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక స్థానికులు ఆందోళన చెందారు. భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుళ్లకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రెస్టారెంట్లో రిఫ్రిజిరేట్(Refrizirator)లోని కంప్రెసర్ పేలడంతో పెద్ద శబ్దంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయని ప్రాథమికంగా నిర్ధారించారు.
………………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
