* రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోన్న కలెక్టర్‌పై దాడి ఘటన
* ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనే ఆరోపణలు
ఆకేరున్యూస్, వికారాబాద్్: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy) ని పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్(Kbr park) లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
