Published:
Updated: 16 Nov 2024 • 06:23 AM
* పసుపుబోర్డు, కోకోనట్ బోర్డుల కోసం వినతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(MINISTER TUMMALA NAGESWARARAO) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నిజామాబాద్లో పసుపుబోర్డు(PASUPU BOARD) ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, భద్రాద్రిలో కోకోనట్ (COCONUT BOARD)బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్ రైతులు పదేళ్లుగా పోరాటం చేస్తున్నా పసుపు బోర్డు కల సాకారం కావడం లేదన్నారు. పసుపుసాగు విస్తరణ, ఎగుమతి అవకాశాలు పెరగడానిక బోర్డు తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
