ఆకేరున్యూస్, హైదరాబాద్: లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లగచర్ల బాధితులు వివరించి ఫిర్యాదు చేశారు. పార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు వెళ్లారు.
…………………………….