* అవసరమైతే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచన
ఆకేరున్యూస్, అమరావతి : వైసీపీ(YCP) అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడినవారిపై ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తోంది. శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ(RAMGOPAL VARMA) తదితరులపైపలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్(MADDIPADU POLICE STATION) లో ఈ నెల 11న కేసు నమోదైంది. 2024 మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు(CHANDRABABU), నారా లోకేష్(NARA LOKESH), బ్రాహ్మణి(BRAHMANI)లపై అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మద్దిపాడు పోలీసులు హైద్రాబాద్ లో వర్మకు ఈ నెల 13న నోటీసులు అందించారు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. దీంతో వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ ను కొట్టి వేసింది. అరెస్ట్ పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈనేపథ్యంలో వర్మ ముందస్తు బెయిలు పిటిషన్(BAIL PETITION) కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
