* చిల్లరగా మాట్లాడుతున్నాడు
* అబద్దాలు, మోసాలతో అధికారంలోకి వచ్చారు
* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరున్యూస్, వరంగల్: సీఎం అనే విషయాన్ని మరిచిపోయి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) చిల్లరగా, చీటర్‌గా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (DAYAKER RAO) విమర్శించారు. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని దయాకర్ రావు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో టిడిపి ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తే… రేవంత్‌రెడ్డి తప్పించుకొని తిరిగారని ఆరోపించారు. ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అబద్దాలు, మోసాలు, తప్పుడు ప్రమాణాలతో అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
హనుమకొండలోని నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాళోజీ నారాయణరావు గురించి గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి ఏ రోజైనా కలిశారా, పరిచయం చేసుకున్నారా అని నిలదీశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు రాక్షసుడు అంటూ రేవంత్ మాట్లాడారని,ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పోరాడే రాక్షసుడని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ సభ ఒక వంచన సభ అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి 11 నెలల కాలంలో 85 వేల కోట్లు అప్పు చేశారని ఇలా అప్పు చేసి ఏ పథకాన్ని అమలు చేయకుండా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. వరంగల్ సభతో రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
