Published:
Updated: 21 Nov 2024 • 05:22 AM
ఆకేరున్యూస్ డెస్క్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో రూ. 7 కోట్ల వ్యయంతో 3ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మూడో ద్వీపాన్ని (ఐలాండ్ ను) పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇప్పటికే రెండు ద్వీపాలు ఉండగా, పర్యాటకుల కోసం మరో ద్వీపం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
…………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
