Published:
Updated: 21 Nov 2024 • 05:23 AM
* 50 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆకేరున్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫుడ్పాయిజన్కు గురైన ఘటనలో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ముగ్గురు విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.
……………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
