* మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరు న్యూస్, ఖమ్మం : రైతులకు బోనస్ అనేది కాంగ్రెస్(congress) హయాంలో బోగస్ గా మారిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harishrao) విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్(Rythu Declaration)లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామన్నారని, ఇప్పుడు తుస్ అంటున్నారని ఆరోపించారు. ఖమ్మం పత్తి మార్కెట్(Khamam pathi market)ను ఆయన శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందన్నారు.
కనీస మద్దతు ధర కూడా కరువైందన్నారు. పత్తి ప్రతి క్వింటాకు రైతుకు రూ.1500 నష్టం వస్తున్నదన్నారు. పత్తి రైతులు రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సగానికిపైగా ధాన్యం దళారుల పాలైందని చెప్పారు. హరీశ్ రావు వెంట మాజీ మంత్రులు పువ్వాడ అజయ్(Puvvada Ajay), గంగుల కమలాకర్, ఎంపీ వద్దరాజు రవిచంద్ర(Mp Vaddaraju Ravichandra) తదితరులు ఉన్నారు.
…………………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
