* లోక్‌మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పిలుపు
* రెండురోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి ప్రయాణం
ఆకేరున్యూస్, హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పటిష్టం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ( Draupadi Murmu ) అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామం (SHILPARAMAM) లో లోక్‌మంథన్ (LOK MANTHAN ) ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్రపతి మాట్లాడారు. ాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ‘2018లో రాంచీలో లోక్‌మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నా. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పటిష్ఠానికి ఈ ప్రయత్నం గొప్పది.
ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఏర్పడిరదని.. విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన విూద జులూం ప్రదర్శించాయని.. మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్స్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. లోక్ మంథన్ కార్యక్రమం అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుగు ప్రయాణం అయ్యారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
