* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు
ఆకేరున్యూస్, వరంగల్: మహిళలు ఎక్కడైన లైంగిక వేధింపులకు గురవుతుంటే మౌనం పాటించకుండా ధైర్యంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనర్ అంబర్ కిషోర్ జు మహిళలు, విధ్యార్థునులకు పిలుపునిచ్చారు. వివిధ ప్రదేశాల్లో మహిళలు ఈ విధమైన లైంగిక వేధింపులకు గురౌవుతున్నారు. తక్షణమే సదరు బాధిత మహిళలు స్పందించాల్సిన తీరుపై మహిళలకు అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ మహిళ రక్షణ విభాగం నూతనంగా రూపొందించిన వాల్‌పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మహిళలు బాలికల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అలాగే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపట్ల కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.
ప్రధానంగా మహిళలు, బాలికలు, అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వుండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని. ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తంగా వుండాలని.. మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని, మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్నా.. అలాగే ర్యాగింగ్ ముసుగులో విద్యార్థునులు సైతం వేధింపులకు గురవుతున్న మహిళలు, విద్యార్థునులు, బాలికలు మౌనంతో వుండిపోకుండా, ధైర్యంగా స్థానిక షీ టీం బృందాన్ని లేదా డయల్ 100 ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి జితేందర్ రెడ్డి, వరంగల్ షీ టీం ఇన్స్‌స్పెక్టర్ సుజాతతో పాటు షీ టీం సిబ్బంది పాల్గ్గొన్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
