* లగచర్ల ఘటనలో కేసులు ఎత్తివేసి బాధితులను వెంటనే విడుదల చేయాలి
* ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఆకేరున్యూస్, హైదరాబాద్: లగచర్ల ఘటనలో అమాయకులను జైలులో పెట్టారని, కేసులు ఎత్తివేసి బాధితులను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన సంగారెడ్డి జిల్లా కంది జైలులో లగచర్ల బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బక్కి వెంకటయ్య విలేకరులతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డికి గ్రౌండ్ లెవల్ రిపోర్టు ఇస్తామని చెప్పారు. లగచర్ల, రొటిబండ తండాలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ బృందం పర్యటించిందని, ఇప్పటికీ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారన్నారు. కలెక్టర్‌పై దాడి ఘటన దురదృష్టకరమని, కానీ అమాయకులను జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. లగచర్ల బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
