* రెండుసార్లు బండి సంజయ్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి కాలేదు
* రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నానని రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABAKER) అన్నారు. హుజూరాబాద్ – కమలాపూర్ మధ్యన రోడ్ మార్గంలో ప్రయాణిస్తుండగా రైల్వే గేట్ వద్ద రైలు గేటు పడడంతో ఆగిన మంత్రి పొన్నం ఈ సందర్భంగా మాట్లాడారు. ఉప్పల్ రైల్ ఓవర్ బ్రిడ్జిని పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టీ శంకుస్థాపన చేశానన్నారు. ఆ తరువాత ఎంపీగా వినోద్ కుమార్, తరువాత రెండు సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యారని అయినా ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఇలాగే ఉందని గుర్తు చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్తున్నానని అక్కడ సహచర ఎంపీలతో కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పొన్నం ప్రభాకర్ అన్నారు. రైల్వే పార్ట్ వరకే నిర్మాణం చేయాల్సి ఉందని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ ఆర్ఓబిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
