* అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన వరంగల్ సీపీ
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు (Constitution Day)మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ (cp) అంబర్ కిషోర్ జు (amber kishor ju) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని చట్టాలను సైతం పొందుపరిచారని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం అదనపు డీసీపీ రవి పోలీసు అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు, ఏసీపీలు ఆర్ఐలు ఇన్స్పెక్టర్లు పరిపాలన విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
