* 40 మందికి అస్వస్థత
ఆకేరున్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ (FOOD POISON) జరిగింది. మంగళవారం మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు (40 STUDENTS) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడగా.. గమనించిన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించి మాగనూరు పీహెచ్సీలో విద్యార్థులకు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడోసారి. దీనిపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
