* ఆ ఓటే రైతన్న చరిత్రను తిరగరాసింది
* తెలంగాణ ఏడాది పాలనపై సీఎం రేవంత్ ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ (ఎక్స్) వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు అరక పట్టి పొలానికి వెళ్లాల్సిన రైతు మార్పు కోసం ఓటు వేశాడు. ఆ ఓటు అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగదాసింది. ఒక్క ఏడాదిలో రూ. 54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.
ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…
రూ.1433 కోట్ల రైతుబీమా…
రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…
రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు…
ఈ సంతోష సమయంలో…
అన్నదాతలతో కలిసి…
రైతు పండుగలో పాలు పంచుకోవడానికి…
ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా”… అంటూ ట్వీట్ చేశారు.
………………………………………………………………