* ఘనంగా హయగ్రీవాచారి 108వ జయంతి
* నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు
ఆకేరున్యూస్, హన్మకొండ: మాజీ మంత్రి, కాంగ్రెస్ దిగ్గజం హయగ్రీవాచారి 108వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఏఐసిసి సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ శాసన సభ్యులు ఆరెల్లి మోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, సీనియర్ నాయకులు సిదిరాల సుధాకర్, మాజీ కార్పోరేటర్ రేపల్లె శ్రీనాధ్, మాజీ కార్పోరేటర్ హన్మకొండ రాజేందర్ హయగ్రీవాచారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ హయగ్రీవాచారి వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి ఎనలేని కృషి చేసారన్నారు. వారు స్వాతంత్య్ర సమరయోధులని.. దేశంకోసం, తెలంగాణ కోసం నైజాంలకు వ్యతిరేక పోరాటంలో అండర్‌గ్రౌండ్‌లో ఉండి ప్రాణాలకు తెగించి పనిచేశారని కొనియాడారు. హయగ్రీవాచారి అనేక మందిని రాజకీయ నాయకులుగా తయారు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేపల్లె శ్రీరంగనాద్, సునీల్, రమాదేవి, సునిత, పల్లవి యాదగిరి, రఫీ తదితరులు పాల్గొన్నారు.

……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
