* ప్రమాద తీవ్రత పెరగకుండా అలర్టయిన అధికారులు
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్లగొండ జిల్లా(Nallagonda | ) చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల శ్రీపతి ల్యాబ్లో (Sripati lab) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్లో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో(Reactor exploded) సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. రియాక్టర్ పేలడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగ దట్టంగా వ్యాపించింది. ఘటనపై చిట్యాల పోలీసులు సకాలంలో స్పందించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో హుటాహుటిన కంపెనీకి చేరుకొని ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం నుంచి కంపెనీలోని కార్మికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
