Warangal Chain Snatching Attempt
* కుటుంబ సభ్యులు లేవడంతో పరార్
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ల నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో తెల్లవారుజామున చైన్ స్నాచింగ్‌కు ఓ దొంగ విఫలయత్నం చేశాడు. గోపాలస్వామి గుడి సమీపంలోని మలహల్ రావు ఇంట్లోకి చొరబడిన దొంగ.. నిద్రిస్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
గొలుసు లాక్కునే క్రమంలో మహిళకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే ఆమెకు మేలుకువ రావడంతో అప్రమత్తమైన దొంగ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా నిద్రలేవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మట్టేవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులను విచారించి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
