ఆకేరు న్యూస్ డెస్క్ : జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లా (Doda District) లో ఉగ్రవాదులు (Terrorists), భద్రతా బలగాల (Security forces) మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter) లో నలుగురు జవాన్లు (Four jawans) ప్రాణాలను కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) పోలీసుల రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles),స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (Special Operations Group) సైనికులు దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉర్బాగి (Dhari Gote Urbagi) వద్ద సంయుక్త కార్డన్, సెర్చ్ ఆపరేషన్ (Search operation) ప్రారంభించారు. ఉగ్రవాదులు ఎదురవ్వడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అధికారితో సహా నలుగురు సైనికులు మంగళవారం తెల్లవారుజామున మరణించారని అధికారిక వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్బాగిలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు సంయుక్తంగా కార్డన్ , సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయితే సవాళ్లతో కూడిన భూభాగం, దట్టమైన చెట్లు ఉన్నప్పటికీ ఒక అధికారి నేతృత్వంలోని సైనికులు వారిని వెంబడించారని ఆయన చెప్పారు.
———————–