Varanasi Photo Leak Puts Rajamouli Team on Alert
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా ఫస్ట్ టైం షూట్ చేస్తున్న సమయంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే చిన్నపాటి క్లిప్ లీక్ కావడం తెలిసిందే. ఇది కాస్త వైరల్ అయ్యింది.
ఈ విషయం తెలుసుకొన్న రాజమౌళి టీం వెంటనే నివారణ చర్యల్లోకి దిగే లోపు లక్షలాది మంది చెంతకు చేరింది. సోషల్ మీడియాలో క్లిప్ డిలీట్ చేయించేసరికి తలబొప్పి కట్టింది.
* మరోసారి రిపిట్
తాజాగా వారణాసి నుంచి కాశీ ఎపిసోడ్ కు చెందిన ఫొటో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. వెంటనే అలెక్ట్ అయిన జక్కన్న టీం వేగంగా స్పందించి సదరు వ్యక్తులపై కేసులు పెట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ఎలా జరిగిందో తెలియక జక్కన అండ్ టీం తలలు బాదుకుంటున్నట్లు తెలుస్తోంది.
* మూడు రోజుల్లో మహేష్ బర్త్ డే
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఉండగా ఈ క్రమంలో వారణాసి నుంచి ఫొటో లీక్ కావడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఒక్కటే టెన్షన్ నెలకొంది. సూపర్ స్టార్ బర్త్ డే ముందు ఇలా జరగడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. ఏది ఏమైనా ఇలా జరగడం సబబు కాదు..
* రెండు కొత్త పోస్టర్లు
ఈ లీక్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ కు ఒక శుభవార్త లాంటి వార్త అని చెప్పొచ్చు. బర్త్ డే సందర్భంగా ఆ రోజు రెండు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
* 80 శాతం షూట్ ఇటీవలే పూర్తి
80 శాతం షూట్ ఇటీవలె పూర్తి అయ్యిందని చిన్న చిన్న సీన్స్ మాత్రమే మిగిలున్నాయని డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం బాధ్యతలు వహిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
