KTR Slams CM Revanth Reddy Over Frequent Delhi Visits
* ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు కూడా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీ వెళ్లాడని, అక్కడ దేహి దేహి అంటూ యాచిస్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 13 రోజులకోసారి ఢిల్లీకి పోయి గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం ఎదగాలని ఉద్యమ సమయంలో జయశంకర్ సార్ అనేవారని గుర్తుచేశారు. కానీ నేడు ఢిల్లీ వాళ్లను యాచిస్తూ, వాళ్ల ముందు గులాంగిరీ చేస్తుండని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. జయశంకర్ సార్ ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దని, స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటే ఆయన ఆశలను రేవంత్ అడియాసలు చేస్తున్నారని విమర్శించారు.
* సింహంలాంటి ఒకే వ్యక్తి కేసీఆర్
ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలో ఉన్న పరపతిని ఆసరాగా చేసుసుకుని నీటి వాటాల విషయంలో ఏపీ ఆడుకుంటోందని, తెలంగాణ పార్టీ అయితే ఈ పరిస్థితి ఉండేనే అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా గొంతు విప్పితే ఒక సింహం లాగా గర్జించే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టిందని అన్నారు. కాంగ్రెస్‌లో కలవొద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కేటీఆర్ గుర్తు చేశారు. మా గురువు జయశంకర్ సార్ అయితే.. వాళ్ల గురువు చంద్రబాబు అని రేవంత్‌ను విమర్శించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
