Kodandaram Congress Remarks
* ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ సర్కారుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ జన సమితి పార్టీ తరఫున కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఆయన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పదవుల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ వైఖరి సరిగా లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేయడం లేదన్నారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇస్తామని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పదవుల భర్తీ ఆలస్యం కారణంగా తమకు కలిగే ప్రయోజనం శూన్యమని కోదండరాం అన్నారు. అలాగే కాంగ్రెస్ తో కలిసి నడిచినా సమస్యల పరిష్కారం రాజీపడబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ పదవులపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
* గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీపై చర్చిస్తున్నాం..
రాష్ట్రంలో రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, తాము మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాలనే ఆశ లేదని గతంలో కోదండ రాం పేర్కొన్నారు. తాజాగా పదవులపై ఆసక్తి చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. తమకు ఎమ్మెల్సీ, కార్పోరేషన్ చైర్మన్లు ఇస్తామన్న ఈ విషయాన్ని ఈరోజు తెరపైకి తెచ్చారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ అంశంపై కాంగ్రెస్ తో చర్చిస్తున్నాం అన్నారు. కాగా, విద్యార్థుల ప్రయోజనాలు, భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కోదండరాం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపుతోందని కొనియాడారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
